VIDEO: అయ్యప్ప పడిపూజలో పాల్గొన్న మాజీ మంత్రి
WGL: పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో గురుస్వామి దువ్వ మహేందర్ ఏర్పాటు చేసిన మహా పడిపూజ కార్యక్రమంలో ఇవాళ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామికి పాలభిషేకం చేసి, భక్తులతో కలిసి భక్తిగీతాలు ఆలపించారు. కార్యక్రమంలో సోసైటీ ఛైర్మన్ మనోజ్ గౌడ్, ఈరగని మనోహర్, ఇస్మాయిల్, నాగరాజు, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.