VIDEO: బస్సుల కొరతతో ప్రయాణికులకు ఇబ్బందులు

VIDEO: బస్సుల కొరతతో ప్రయాణికులకు ఇబ్బందులు

కృష్ణా: గుడివాడ ఆర్టీసీ బస్టాండ్‌లో ఆదివారం పరిస్థితి పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. ఉచిత బస్సు పథకానికి ప్రజలు భారీ ఎత్తున తరలి వస్తుండగా, బస్సులను సమకూర్చలేక ఆర్టీసీ డిపో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ప్రయాణికుల ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, బస్సుల సౌకర్యం కల్పించి, తగు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.