మేధావులు పెదవి విప్పాలి: బండి సంజయ్
డీలిమిటేషన్, మహిళా బిల్లుపై మేధావులు పెదవి విప్పాలని, వారి మౌనం సమాజానికి అరిష్టమని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. సీట్ల పెంపుతో దక్షిణాదికి కలిగే ప్రయోజనాలను వివరిస్తూ, కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేశారు. మహిళా రిజర్వేషన్లు అంబేద్కర్ ఆలోచనల్లో భాగమేనని.. వాటిని అడ్డుకుని మహిళలకు కాంగ్రెస్ కూటమి తీరని ద్రోహం చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.