ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురికి గాయలు

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురికి గాయలు

KMR: భిక్కనూర్ మండలంలోని బీటీఎస్ చౌరస్తా వద్ద 44వ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి ఆర్మూర్ వైపు వెళ్తున్న కారు డివైడర్‌కు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిని స్థానికులు 108 అంబులెన్స్ కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.