మార్కెట్ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తా: వేణారెడ్డి

SRPT: మార్కెట్ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పాలకవర్గం పనిచేస్తుందని మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. ఇవాళ సూర్యాపేటలో మార్కెట్ యార్డులో పనిచేస్తున్న కార్మికులకు ఏకరూప దుస్తులను పంపిణీ చేసి మాట్లాడారు. యార్డులో పనిచేస్తున్న మహిళలకు మరుగుదొడ్లు, కార్మికులకు విశ్రాంతి గదులను ఏర్పాటు చేసేందుకు పాలకవర్గం తీర్మానం చేసిందన్నారు.