పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్
సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మద్దిరాల, తుంగతుర్తి మండలాల్లో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ పోలింగ్ కేంద్రాలను సోమవారం పరిశీలించారు. ఫ్యాన్స్, లైట్స్, , ర్యాంప్, త్రాగునీరు వంటి మౌలిక వసతులు పూర్తిగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. పోలింగ్ అనంతరం కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, గ్రామాలలో సమస్యలు ఉంటే వెంటనే తెలియజేయలని తెలిపారు.