మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ వ్యూహం ఏంటి..?
ములుగు మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ 20 వార్డులలో అభ్యర్థులను బరిలోకి దింపింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో కేవలం 5,000 ఓట్లు మాత్రమే సాధించింది. పట్టణ ఓటరు బీజేపీకే ఓటు వేస్తారనే ధీమా, జిల్లాలో సమ్మక్క-సారలమ్మ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు, మేడారం జాతర అభివృద్ధికి నిధుల విడుదల, జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధిపై పార్టీ ఆశలు పెంచుకుంది.