ముత్యాలమ్మ జాతరకు ముహూర్తం ఖరారు.. 11న బోనాలు
MHBD: ఇనుగుర్తి మండలంలోని చిన్ననాగరం గ్రామంలో ఫిబ్రవరి 11న ముత్యాలమ్మ తల్లి బోనాల పండుగ జాతర నిర్వహించేందుకు మంగళవారం వాస్తు జ్యోతిష్య పండితులు పోలోజు పూర్ణ చారి, గ్రామస్తుల సమక్షంలో ముహూర్తాన్ని నిర్ణయించారు. ఈ ముహూర్త పత్రాన్ని సర్పంచ్ చెడుపాక సుజాత యాకయ్య, సీనియర్ గౌడ సంఘం నేత వైరు వెంకటయ్య గౌడ్‌తో పాటు ఇతర ప్రముఖులకు అందజేశారు.