VIDEO: ఎస్ కోటలో కోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన
VZM: ఎస్ కోటలో నూతనంగా నిర్మించనున్న కోర్టు భవన నిర్మాణానికి హైకోర్టు న్యాయమూర్తులు మానవేంద్రరాయ్, టి రాజశేఖర రావు ఆదివారం శంకుస్థాపన చేశారు. నాణ్యత ప్రమాణాలతో సకాలంలో నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మెజిస్ట్రేట్ ఎం బబిత, ఎస్.కోట మెజిస్ట్రేట్ బి కనక లక్ష్మి, కలెక్టర్ ఎస్ రామ సుందర్ రెడ్డి, ఉమ్మడి జిల్లాల ఎస్పీలు, తదితరులు పాల్గొన్నారు.