టీజీ సెట్ ఫలితాల్లో గుండ్రంపల్లి విద్యార్థుల ఘనత
NLG: రాష్ట్ర ప్రభుత్వం 5వ తరగతి ప్రవేశాల కోసం ఫిబ్రవరిలో నిర్వహించిన టీజీ సెట్ 2025 ఫలితాల్లో చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామానికి చెందిన విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ ప్రవేశ పరీక్షలో గ్రామానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత సాధించి, వివిధ గురుకుల పాఠశాలల్లో సీట్లు సాధించినట్లు ప్రిన్సిపల్ దోర్నాల శివ తెలిపారు.