సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శిగా భూమేశ్వర్

సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శిగా  భూమేశ్వర్

JGL: సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శిగా పెగడపల్లి మండలం కీచులాటపల్లికి చెందిన ఇరుగురాల భూమేశ్వర్ నియమితులయ్యారు. ఆయనను పార్టీ నాయకులు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా భూమేశ్వర్ మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీ బలోపేతానికి తన వంతుగా కృషి చేస్తానని పేర్కొంటూ, తన నియామకానికి సహకరించిన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.