రేవంత్ రెడ్డి నోరా.. మోరా? .. హరీష్ రావు ఫైర్

రేవంత్ రెడ్డి నోరా.. మోరా? .. హరీష్ రావు ఫైర్

SDPT: సీఎం రేవంత్ రెడ్డిపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విరుచుకుపడ్డారు. "రేవంత్ రెడ్డిది నోరా మోరా.? 2004-14లో టీడీపీలో ఉండి వైఎస్ఆర్‌పై పావురాల గుట్టలో పావురం అయ్యాడని అన్నాడు. ఆ పాలన మంచిదైతే అప్పుడు ఎందుకు తిట్టాడు. తన తండ్రి దహన సంస్కారాల రోజే కరెంట్ లేదని అసెంబ్లీలో అన్నాడు. ఇప్పుడు ఆ ఊర్లలో 24 గంటలు కరెంట్ ఉంది అంటే అది కేసీఆర్ పాలన ఫలితం" అని అన్నరు.