బుక్కపట్నం చెరువులో సాయి విగ్రహం ఏర్పాటుకు సీఎం సానుకూలం
సత్యసాయి: పుట్టపర్తిలోని బుక్కపట్నం చెరువులో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా విగ్రహం ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలత వ్యక్తం చేశారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు. పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువులను కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు.