VIDEO: నీటి విడుదలతో మునిగిన పంటలు
WGL: రాయపర్తి మండలం మైలారం గ్రామంలో బ్యాలెన్సింగ్ రిజర్వర్ గేట్లు లేపడంతో కాలువలో నీటి ప్రవాహం పెరిగి పంట పొలాలు నీటమునిగాయి. ఈ పరిస్థితిని గమనించిన మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్ రైతులతో కలిసి శుక్రవారం పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ఎస్ఆర్ఎస్పీ డీఈకి ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. గేట్లు మూసివేయాలని కోరారు.