నగరి మున్సిపల్ కుక్కల కోసం వేట

CTR: నగరి మున్సిపల్ పరిధిలో కుక్కల బెడద పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇటీవల జిల్లాలో చిన్నారులపై కుక్కల దాడులు చోటు చేసుకోవడం, ఈ అంశంపై హ్యూమన్ రైట్స్ రాష్ట్ర కార్యదర్శి జ్యోతి నాయుడు ఫిర్యాదు చేయడంతో మున్సిపల్ అధికారులు స్పందించారు. శుక్రవారం సాయంత్రం ప్రత్యేక శిక్షణ పొందిన బృందంతో కుక్కల వేట నిర్వహించారు.