VIDEO: 'కోడి పందాలు నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు'

VIDEO: 'కోడి పందాలు నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు'

E.G: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కోడి పందాలు నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని అనపర్తి తహసీల్దార్ అనిల్ కుమార్ హెచ్చరించారు. అనపర్తి ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన సోమవారం మాట్లాడారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన, కోడిపందాలు నిర్వహించిన ఆడిన చర్యలు తప్పవన్నారు. ఎంపీడీవో రామకృష్ణారెడ్డి, ఎస్సై శ్రీను నాయక్ పాల్గొన్నారు.