మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
ELR: లింగపాలెం మండలం కే. గోకవరం హై స్కూల్‌లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం అమలు తీరును చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ బుధవారం పరిశీలించారు. విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులతో కలసి భోజనం చేస్తూ వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. సంబంధిత విద్యాధికారులతో, ఉపాధ్యాయులతో సమీక్షించారు.