VIDEO: నిండిన చెరువు.. పారుతున్న అలుగు

MDK: రేగోడు మండలం జగర్యాల వద్ద చెరువు నిండి అలుగుపడుతుంది. గత మూడు నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో చెరువులు కుంటలు నిండుతున్నాయి. జగిర్యాల వద్ద చెరువు నిండి అలుగు పారుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలుగులు పారి భారీగా నీరు వస్తుండడంతో కొండాపూర్ - జగిర్యాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.