ఉషోదయ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా
NZB: బోధన్ పట్టణంలోని ఉషోదయ డిగ్రీ కళాశాలలో గురువారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 11 కంపెనీలు హాజరవ్వగా ఇందుకోసం 450 మంది విద్యార్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నారు. 277 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉషోదయ విద్యాసంస్థల ఛైర్మన్ సూర్య ప్రకాష్ నియామక పత్రాలను అందించారు.