రేగోడ్‌లో వాహనాల తనిఖీలు

రేగోడ్‌లో వాహనాల తనిఖీలు

MDK: మెదక్ SP శ్రీనివాసరావు ఆదేశాలపై DSP ప్రసన్నకుమార్ సూచనలతో రేగోడ్ మండలం వెంకటాపూర్‌లో SI పోచయ్య వాహనాల తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో నంబర్ ప్లేట్ లేని 4 వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ధ్రువపత్రాలు పరిశీలించి నంబర్ ప్లేట్ అమర్చిన తర్వాత వదిలిపెట్టినట్లు తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా నంబర్ ప్లేట్ అమర్చుకుని, పత్రాలు వెంట తీసుకెళ్లాలని సూచించారు.