ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ప్రభుత్వ విప్

ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ప్రభుత్వ విప్

MHBD: మరిపెడ మున్సిపాలిటీలోని 9వ వార్డులో దూకుంట్ల నాగమణి- వెంకన్నల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం శనివారం జరిగింది. ప్రభుత్వ విప్, డోర్నకల్ MLA డా.జాటోత్ రామచంద్రనాయక్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఇంటిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట మరిపెడ మున్సిపాలిటీ చైర్ పర్సన్ విశారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, తదితరులున్నారు.