ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే
VZM: జిల్లా కేంద్రంలోని టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు "ప్రజా సమస్యల పరిష్కార వేదిక"ను ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రజల వద్ద నుంచి పలు వినతులను స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.