రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
W.G: నల్లజర్ల మండలంలోని పుల్లలపాడు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌ను వెనుక నుంచి వచ్చి లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో ఏలూరు జిల్లా చింతలపూడి గ్రామానికి చెందిన రాయల శివరామకృష్ణ (30) మృతి చెందాడు. బైక్‌పై కూర్చున్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరిలించారు. ఈ ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.