యూరియా కోసం బారులు తీరిన రైతులు

యూరియా కోసం బారులు తీరిన రైతులు

MDK: రామాయంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద మంగళవారం యూరియా కోసం రైతులు బారులు తీరారు. యూరియా లారీ వచ్చిన విషయం తెలుసుకున్న రైతులు ఉదయం నాలుగు గంటల నుంచి టోకెన్ల కోసం కార్యాలయం వద్ద వందలాదిమంది రైతులు బారులు తీరారు. 15 రోజులుగా యూరియా లేక ఇబ్బంది పడుతున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.