తిరుమలలో నేటి స్పెషల్ ఇదే..!

TPT: తిరుమల ఆలయంలో ఏడాదికోసారి జరిగే ఆణివార ఆస్థానానికి ఓ ప్రత్యేకత ఉంది. 1843 జూలై 16న మహంతులు తిరుమల పరిపాలన స్వీకరించారు. దేవస్థాన ఆదాయ, వ్యయాలు, ఏడాది లెక్కలు ఆ రోజున స్వామివారికి అప్పజెప్పి నూతన వార్షిక సంవత్సరాన్ని ప్రారంభించేవారు. ప్రస్తుతం వార్షిక బడ్జెట్ ఏప్రిల్‌కు మారినా అప్పటి సాంప్రదాయాన్ని నేటికీ TTD కొనసాగిస్తూ.. ఆణివార ఆస్థానం నిర్వహిస్తోంది.