'పారాక్వాట్ గడ్డిమందును నిషేధించాలి'
GNTR: ఆత్మహత్యలకు కారణమవుతున్న 'పారాక్వాట్' గడ్డిమందును నిషేధించాలని ఎమ్మెల్యే గల్లా మాధవి కోరారు. గురువారం అసెంబ్లీ జీరో అవర్‌లో ఆమె మాట్లాడారు. ఇది సైలెంట్ కిల్లర్‌గా మారిందని, 5 ఎంఎల్ తాగినా ప్రాణాలు పోతున్నాయన్నారు. దీనికి ఎలాంటి విరుగుడు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ, పంజాబ్ తరహాలో ఏపీలోనూ ఈ గడ్డిమందును తక్షణమే నిషేధించాలని కోరారు.