'వైసీపీ శవ రాజకీయాలు మానుకోవాలి'
ASR: వైసీపీ శవ రాజకీయాలు మానుకోవాలని జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ హితవు పలికారు. పాడేరులో ఆయన మాట్లాడుతూ.. కాశీబుగ్గలో జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. తండ్రి శవాన్ని పక్కనపెట్టుకుని రాజకీయం చేసిన వారు, బాబాయిని గొడ్డలి వేటుతో చంపేసి రాజకీయానికి తెరలేపారన్నారు. వైసీపీ నాయకులు మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.