పూడికతీత పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

HNK: హనుమకొండ నగరంలోని భద్రకాళి చెరువు పూడికతీత పనులు వేగవంతం చేయాలని హనుమకొండ కలెక్టర్ పీ.ప్రావీణ్య అన్నారు. మంగళవారం భద్రకాళి చెరువు పూడికతీత మట్టిని డంపింగ్ చేయడానికి ప్రతిపాదిత ప్రభుత్వ స్థలాలను ఉపయోగించుకోవాలని ఆమె సూచించారు. ఆమె వెంట వరంగల్ కలెక్టర్ సత్య శారద, వరంగల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే తదితరులున్నారు.