40 ఏళ్ల కిందట రాజీవ్ గాంధీ.. ఇప్పుడు రాహుల్!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీహార్‌లో 'ఓటర్ అధికార్ యాత్ర'ను చేపట్టారు. ఈ సందర్భంగా జమాల్‌పూర్‌లోని మసీదుకు వెళ్లారు. అక్కడ ఉన్న మసీదు పెద్ద మౌలానాను కలిశారు. అయితే, 1985లో రాహుల్ తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కూడా ఈ మసీదును సందర్శించారు. దీంతో కొందరు అప్పటి ఫొటోను, ఇప్పటి రాహుల్ గాంధీ ఫొటోను పోల్చుతూ సోషల్ మీడియాల్లో పోస్ట్ చేస్తున్నారు.