రేపు మంచినీటి సరఫరాకు అంతరాయం

రేపు మంచినీటి సరఫరాకు అంతరాయం

కృష్ణా: గుడివాడ ఆర్‌టీసీ కాలనీ ఇ.యల్.యస్.ఆర్.ట్యాంక్‌కు వెళ్లే పంపింగ్ మెయిన్ లైనులో లీకేజ్ ఏర్పడింది. ఈ కారణంగా 20వ వార్డు, ఆర్‌టీసీ కాలనీ, చెంచు కాలనీ, చౌదరిపేట, బ్యాంక్ కాలనీ, 1,  2,  3,  7, 11, 35,  36వ వార్డులు, నాగవరప్పాడు, లింగవరం రోడ్, ప్రాంతాల్లో శనివారం మంచినీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని కమిషనర్ మనోహర్ వెల్లడించారు.