కలెక్టర్ ఎదుట 104 ఉద్యోగులు ధర్నా

కలెక్టర్ ఎదుట 104 ఉద్యోగులు ధర్నా

SKLM: రాష్ట్ర వ్యాప్తంగా 104 సేవల్లో పనిచేస్తున్న ఉద్యోగులు పలు సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉద్యోగ సంఘ నేతలు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. భవ్య హెల్త్ కేర్ సర్వీసెస్ యాజమాన్యం జీతాల్లో కోతలు విధించడం, క్యాజువల్ లీవ్‌లను రద్దు చేయడం, బఫర్ సిబ్బందిని తొలగించడం వల్ల తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు.