'సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలి'

'సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలి'

AKP: వరి సాగులో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చునని పాయకరావుపేట ఏవో ఆదినారాయణ రైతులకు సూచించారు. బుధవారం పాల్తేరులో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమాన్ని నిర్వహించారు. నాట్లు వేసే సమయంలో కాలిబాటలు తీసుకోవాలన్నారు. దీనివల్ల పంటకు గాలి వెలుతురు సోకి పైరు ఎరుపుగా పెరుగుతుందని తెలిపారు. తెగుళ్ల ఉధృతి తగ్గుతుందన్నారు.