సీఎంతో మాట్లాడి రూ.200 కోట్ల నిధులుతెస్తా: జగ్గారెడ్డి

SRD: సదాశివపేట మున్సిపాలిటీ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి రూ.200 కోట్ల నిధులు తీసుకొస్తానని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. పబ్లిక్ హెల్త్ అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సదాశివపేటలో మంచినీటి సరఫరా కోసం ప్రైవేట్ కన్సల్టెన్సీతో ప్రతిపాదనలు తయారు చేయించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు.