సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే

TPT: అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గూడూరు ఎమ్మెల్యే పి. సునీల్ కుమార్ అన్నారు. చిట్టమూరు మండలం తాడిమేడు గ్రామంలో రూ. 10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును నాయకులతో కలసి ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో గూడూరు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశామన్నారు.