కూచిపూడి నృత్య అభినయం

మేడ్చల్: ఉప్పల్‌లోని శిల్పారామంలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వరంగల్ నుంచి వచ్చిన గురువు తాడూరి రేణుక శిష్య బృందం చేసిన శ్రీకృష్ణ నృత్య రూపక ప్రదర్శనలతో కనువిందు చేశారు. వెన్నెల హాస్య, సుదీప్తి, అనిష్క, వాత్సల్య, విలాసిని, లాస్య, శ్రీనిధి, సంకీర్తన, తులసి, వసుంధర, స్వాతి, రాగమై, వైష్ణవి, వీణధారి, సాయికృతిక, రిషిక నృత్యాలతో మెప్పించారు.