15 వేల మంది ఉద్యోగులు తొలగింపు
అమెరికా టెలికాం దిగ్గజం వెరిజోన్ దాదాపు 15,000 (15%) మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ప్రత్యర్థి సంస్థలు, కేబుల్ ఆపరేటర్ల నుంచి ఎదురవుతున్న తీవ్ర పోటీ కారణంగా కస్టమర్ల సంఖ్య తగ్గడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం. చందాదారులను నిలుపుకోవడానికి, కొత్త కస్టమర్లను తీసుకువచ్చేందుకు, అలాగే ఖర్చులను తగ్గించుకోవడానికి సీఈఓ డాన్ షుల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.