తిప్పర్తిలో నూతన పారిశుద్ధ్య వాహనాన్ని ప్రారంభించిన సర్పంచ్
నల్గొండ జిల్లాలోని తిప్పర్తి గ్రామపంచాయతీలో నూతన పారిశుద్ధ్య వాహనాన్ని స్థానిక సర్పంచ్ బద్దం రజిత సుధీర్ గురువారం ప్రారంభించారు. శ్రీశ్రీశ్రీ త్రిపుర సుందరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఈ వాహనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి, మాజీ ఎంపీటీసీ పల్లె ఎల్లయ్య, ఉప సర్పంచ్ నూకల దేవకమ్మ సైదులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.