జిల్లాలో వణికిస్తున్న చలి
NZB: జిల్లాలో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోవడంతో, ఉదయం పూట ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం జన సంచారం కనిపించడం లేదు. సాధారణ ఉష్ణోగ్రతతో పోలిస్తే జిల్లాలో 4.7 డిగ్రీలు తక్కువగా నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు తక్కువ ఉన్నాయి.