శ్రీకాకుళం కమిషనర్‌గా హనుమంతు కూర్మారావు

శ్రీకాకుళం కమిషనర్‌గా హనుమంతు కూర్మారావు

శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమీషనర్‌గా హనుమంతు కూర్మారావును ప్రభుత్వం మళ్లీ నియమించింది. ఆయనపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ మంగళవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలో అతిసారం వ్యాప్తిని కారణంగా చూపుతూ కూర్మారావుపై తీసుకున్న సస్పెన్షన్ నిర్ణయం తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే.