సమాజ అభివృద్ధిలో మహిళలే ముందు వరుసలో ఉండాలి

MHBD: సమాజ అభివృద్ధిలో మహిళలే ముందు వరుసలో ఉండాలని సీపీఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అజయ్ సారధి రెడ్డి అన్నారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా 27వ వార్డులోని పాత ఏకశిలా స్కూల్ ఆవరణలో మహిళలకు సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవించడంలో మహిళలదే కీలకపాత్ర అని అన్నారు.