చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి

SRD: చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు మృతి చెందిన సంఘటన హత్నూర మండలం మధుర గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన నాగరాజు (38), నిత్యం చేపలు పట్టడానికి వెళ్ళేవాడిని చేపలకు వల వేశాడు. మరుసటి రోజు ఉదయం చేపలు తీయడానికి చెరువులోకి దిగి వేసిన వలకు చిక్కుకొని నీటిలో మునిగి మృతి చెందాడు.