ఘోర ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు

ఘోర ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు

BDK: దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామ శివారులో ఖమ్మం- అశ్వారావుపేట NHపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా లారీ, డీసీఎం వ్యాన్ ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ మృతి చెందగా, మరో ముగ్గురుకి తీవ్ర గాయాలయ్యాయి. ఎదురెదురుగా ఢీకొన్న వాహనాలు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ఆరు కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ ఏర్పడింది.