డంపింగ్ యార్డ్ రద్దు కోసం కలెక్టర్‌కు వినతి

డంపింగ్ యార్డ్ రద్దు కోసం కలెక్టర్‌కు వినతి

KNR: హుజూరాబాద్ సమీపంలో ప్రతిపాదించిన డంపింగ్ యార్డ్‌ను వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి జిల్లా కలెక్టర్‌ను కోరారు. డంపింగ్ యార్డ్ వల్ల గాలి, నీరు, భూమి కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యం, రైతుల పంటలకు నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా, ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టును నిలిపివేయాలని వినతిపత్రం అందజేశారు.