'టీటీడీకి ఏడాదిలో రూ. 1,000 కోట్ల విరాళాలు'
తిరుపతి: గత ఏడాది కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంకి దాదాపు రూ.1,000 కోట్ల విరాళాలు అందాయని బోర్డు ఛైర్మన్ BR నాయుడు వెల్లడించారు. ఆయన బుధవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతు.. శ్రీవాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 5 వేల ఆలయాల నిర్మాణానికి తీర్మానం చేశామని, తిరుమల మార్గంలో త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు.