నేడు ఎన్నికల ఓటర్ జాబితా అభ్యంతరాల పరిశీలన

BHPL: జిల్లా మండల ప్రాదేశిక ఎన్నికల కోసం ముసాయిదా ఓటర్ జాబితా పై మంగళవారం అభ్యంతరాలను పరిశీలిస్తారు. ఈ నెల 8న రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరిగి, మండల కేంద్రాల్లో పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. జిల్లాలో 3,02,147 మంది ఓటర్లు ఉన్నారు. అభ్యంతరాల పరిశీలన తర్వాత బుధవారం తుది ఓటర్ జాబితాను అధికారికంగా ప్రకటించునున్నట్లు అధికారులు తెలిపారు.