స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించారు: చామల
TG: స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించారని MP చామల కిరణ్ కుమార్ ఆరోపించారు. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం లేదనే స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టామని స్పష్టం చేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో పాల్గొనేందుకు సస్పెండ్ అయిన ఎంపీలకు అవకాశం ఇవ్వాలని కోరారు. 36 శాతం ఓట్లతో మోదీ ప్రధాని అయ్యారని తెలిపారు. చంద్రబాబు, నితీష్ మద్దతుతో ప్రభుత్వం కొనసాగుతోందని విమర్శించారు.