ఫర్టిలైజర్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం

ఫర్టిలైజర్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం

NZB: సాలూరలో గంగా లక్ష్మీ ఫర్టిలైజర్‌కు సంబంధించిన గోదాంలో ఇవాళ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గోదాంలోని స్టాక్, సామగ్రి పూర్తిగా కాలి బూడిద అయ్యాయి. ఈ క్రమంలో స్థానికులు అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వగా.. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. యజమాని లక్ష్మణ్ మాట్లాడుతూ.. రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల నష్టం వాటిల్లిందని వెల్లడించారు.