టైర్లలో నుంచి పొగ.. అప్రమత్తమైన డ్రైవర్

టైర్లలో నుంచి పొగ.. అప్రమత్తమైన డ్రైవర్

GNTR: విజయవాడ నుంచి అమరావతి వెళ్తున్న 301 నంబర్ బస్ ఉండవల్లి సాయిబాబా గుడి దగ్గరకి రాగానే వెనుక టైర్లలో నుంచి పొగ రావడాన్ని డ్రైవర్ గుర్తించి బస్సును నిలిపివేశారు. వెంటనే ప్రయాణీకులను దించేసి మంటలని అదుపు చేశారు. ఎయిర్ సస్పెన్షన్ టైర్ మధ్యలో మంటల్ని గుర్తించారు. ప్రయాణీకులను వేరే బస్సులో పంపించారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు.