'బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి'
NRPT: కొత్తపల్లి మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో ఏప్రిల్ 1 నుంచి 4 వరకు జరిగే శ్రీ గురు లోక్ మాసంద్ ప్రభు (బావోజీ) జాతర బ్రహ్మోత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శనివారం ఆలయ ప్రాంగణంలో అన్ని శాఖల అధికారులతో ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో గిరిజనులు హాజరయ్యే జాతరకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.