చరిత్ర సృష్టించిన సంజూ

IPLలో రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు. RR తరఫున 4000 పరుగులు చేసిన తొలి ప్లేయర్గా రికార్డులకెక్కాడు. CSKతో జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. 2013లో IPLలో అరంగేట్రం చేసిన సంజూ ఈ ఫ్రాంచైజీ తరఫున 148 మ్యాచ్లు ఆడి 4027 పరుగులు చేశాడు. సంజూ తర్వాత బట్లర్(3055), రహానే(2810) వాట్సన్(2372) RR తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లుగా నిలిచారు.